జీవితం అంటే ఏమిటి? చాలా రోజులుగా ఈ ప్రశ్న నాలో మెదులుతోంది. కాని నాలో తలెత్తిన ఈ ప్రశ్నకు నేను పుట్టక ముందే సమాధానం సిద్దంగా ఉంది.
సమాధానం "శంకరాభరణం" !!
30 సంవత్సరాల తర్వాత శంకరాభరణం సినిమా చూశాను. అధే నేను చేసిన పొరపాటు.
కదిలించే సినిమాలు చాలా వస్తాయి. కాని మనల్ని మెల్కొలిపే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. 30 సంవత్సరాల కింద విడుదలైన సినిమ గురించి ఈరోజు చెప్పడం మీకు వింతగా అనిపించవచ్చు.
ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి రోజు విగ్నానం పెరగకపోవచ్చు. కాని, మన విచక్షణాశక్తి పెరుగుతుంది.
ఇది ఒకసారో, లేదా ఒకేసారో చూసే సినిమా కాదు. ప్రతి సంవత్సరం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రతి నెలా చూడొచ్చు.
జీవితం అంటే కూడు, గూడు, గుడ్డ తగినంత దొరకడమే కాదు.
ప్యూరిటీ ఆఫ్ లివింగ్
ప్యూరిటీ ఆఫ్ థింకింగ్
ప్యూరిటీ ఆఫ్ టాకింగ్
ప్యూరిటీ ఆఫ్ హెల్పింగ్
ప్యూరిటీ ఆఫ్ ఎజుకేషన్
ప్యూరిటీ ఆఫ్ ఇన్స్పైరింగ్
ఇదీ జీవితం.
వీటిని ఈ సినిమా నేర్పుతుంది.
ఆ సినిమా ఒక పుస్తకం. ఒక సంప్రదాయం. ఒక విద్య. ఒక జీవితం. ప్రతి జీవితం లో మనల్ని తనువై, మనసై ప్రేమించే మనిషి ఉండాలి.
అంటే జీవితానికి ఒక తులసి (మంజుభార్గవి క్యారెక్టర్) ఉండాలి. నేను చెబుతున్నది స్త్రీ గురించి కాదు. అలాంటి నిష్కల్మషమైన ప్రేమ గురించి.
మనం లేని ఈలోకాన్ని ఊహించుకోలేనంతటి ప్రేమను పంచాలి.
దానికి ఒకటే మార్గం. వేరేవల్ల ప్రేమను కోరకండి. మీరు ప్రేమించండి. ఎదుటివాళ్లు తట్టుకోలేనంతటి ప్రేమను పంచండి.
జీవితంలో మన అవసరాలు తీరడం కాదు గొప్ప.
మనల్ని ప్రేమించే వాళ్లు దొరకడం.
వాళ్లు దొరకాలంటే ముందు అలాంటి ప్రేమను మనం పంచాలి.
ప్రేమ ఒక విత్తు.
ఒక్కసారి నాటండి.. మీ జీవితానికి సరిపడా చల్లటి ప్రేమను ఇస్తుంది.
my new blog
www.indianloversleague.blogspot.com
హెడర్ లో ఫోటో సరిగా ఫోటోషాప్ చెయ్యలేదు అదొక పొరబాటు :))
ReplyDeleteప్రేమించడం ఒక యోగం. ఇది అందరికీ అంత సులువుగా అలవడదు ఎంతో కృషి సల్పితే తప్ప.
ReplyDeleteప్రేమించ బడటం ఒక భోగం. మనం ఒకరి నిష్కల్మషమైన ప్రేమకు పాతృలమవడం అనేది అందరికీ దొరికే సంపద కాదు. :)
నాకు బాగా నచ్చిన సినిమాల్లో ఇది ఒకటి
ReplyDelete