Pages

Monday, May 17, 2010

సాక్షి లో ఓ మంచి ఫీచర్




why mother is GREAT !!?

Tuesday, May 11, 2010

కొన్ని పెళ్లి మంత్రాలు - అర్థాలు

కన్యాదానం సమయంలో...

కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతామ్!
దాస్వామి విష్ణవే తుభ్యం
బ్రహ్మలోక జిగీషయా!!

బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను.

సుముహూర్తంలో...
(జీలకర్ర బెల్లం పెట్టే సమయం)


అస్య ముహూర్తస్య సుతిథిం సువారం
సునక్షత్రం సు యోగం సుకరణం
సుచంద్ర తారాబలం అనుకూలం
శుభశోభనాస్సర్వేగ్రహః సునక్ష త్రాః
శుభై కాదశస్థాన ఫలదాః సుప్రీతాః
సుముహూర్తాః సుప్రసన్నా వరదాః భవంతు

ఈ ముహూర్తమునకు మంచి తిథిని మంచి వారమును మంచి నక్షత్రమును మంచి యోగమును మంచి కరణమును మంచి చంద్రతారాబలమును అనుకూలముగా చేసి శుభములు శోభనములునయి అన్ని గ్రహములును ఫలము నిచ్చునవై మంచి ప్రీతి గలవై సుముహూర్తములు గలవై సుప్రసన్నతగలవై వరములనిచ్చునవై అవుగాక.


మాంగల్య ధారణలో...

మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా!
కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!!

నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు వర్ధిల్లు!

వధువు వరునితో ఏడడుగులు వేసే ముందు ...

saప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట ఏడడుగులు నడిచే వధువుని ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలివి.


ఏకమిషే విష్ణుస్తా వన్వేతు, ద్వే ఊర్ఙే విష్ణుస్త్వా న్వేతు.
మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు.
త్రీణి వ్రతాయ విష్ణుస్త్వా నేతు. చత్వారి
మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు.
పంచ పశుభ్యో విష్ణుస్త్వా న్వేతు. షడృతుభ్యో విష్ణుస్త్వా న్వేతు.
సప్త హోత్రాభ్యో విష్ణుస్త్వా న్వేతు

ఓ చిన్నదానా! నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడగువల్ల అన్నాన్ని, రెండవ అడుగువల్ల బలాన్ని, మూడో అడుగువల్ల మంచి కార్యాలను, నాల్గో అడుగువల్ల సౌఖ్యాన్ని, ఐదో అడుగువల్ల పశుసమృద్ధిని, ఆరో అడుగువల్ల ఋతు సంపదలను, ఏడో అడుగువల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక.

సఖా సప్తపదా భవ. సఖాÄౌ సప్తపదా బభూవ. సఖ్యంతే
గమేయం. సఖ్యాల్తే మా యోషం. సఖ్యాన్మే మా యోష్ఠాః
సమయావ. సంకల్పావ హై. సంప్రిÄౌ రోచిష్ణూ
సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ
మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్

నాతో ఏడడుగులు నడచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహాన్నుంచి ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహాన్నుంచి నీ వెన్నడూ వియోగం పొందకు! పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలసి ఉందాం. కలసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడుచుకుందాం.

***


అరుంధతీ నక్షత్రం

వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్నీ చూపిస్తారు.

ధృవనక్షత్రంలా వారు నిశ్చలమైన మనస్తత్తా ్వలతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష ఇందులో కలదు.

Friday, April 16, 2010

అమెరికాలో (మేరి ల్యాండ్) ఉచిత వైద్యశాల !

డాక్టర్స్ కమ్యునిటీ హాస్పిటల్ పేరుతో అమెరికాలోని కొందరు ప్రముక డాక్టర్లు నాన్ - ఫ్రాఫిట్ ఆస్పత్రిని నెలకొల్పారు.
ఈ వివరాలు మీరు స్వయంగా, పూర్తిగా లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.


http://www.dchweb.org/dch/about/index.html

for doubts fallow this link

http://www.dchweb.org/dch/about/faq.html

Monday, April 12, 2010

Monday, April 5, 2010

ఈ పోస్ట్ మీకు నచ్చకపోతే ఇక నేను బ్లాగు రాయడమే మానేస్తా !!





నేను బ్లాగు రాయాలో వద్దో దయచేసి కామెంట్ లో రాయండి.

నాకు ప్రియురాలు వద్దు ! మరి మీకు

కంప్యూటర్లూ, సాఫ్ట్వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో... ప్రియురాలి వంటి పట్నాన్నే కాదు... తల్లివంటి పల్లెను కూడా తలచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడో వ్యక్తి! అనుకోవడమే కాదు, అకుంఠిత దీక్షతో నెలల తరబడి గ్రామాల వెంట తిరిగాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లాడు. అందుకు కారణమైన లోతుల్ని తరచిచూశాడు. అక్షరబద్ధం చేశాడు. పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చాడు. ఆయనే పాలగుమ్మి సాయినాథ్‌..రామన్‌ మెగసెసే అవార్డు విజేత.
* * *
ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్‌ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ మాటల్లో చెప్పాలంటే ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్‌ ఒకరు.
***
'దేశం మొత్తం మీదా గత పదేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అందుకు కారణమైన ఒక్క అధికారికి కూడా కనీస శిక్షపడలేదు' అన్న సాయినాథ్‌ మాటలు కఠినంగా అనిపించొచ్చుగానీ అవి అక్షర సత్యాలు.
***
ఇన్ని మాటలెందుకు... పాలమూరు వలసలూ, అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి ఆయన రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్‌నగర్‌ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది సాయినాథే.
***
పాముకాటుతో రైతులు మరణించడానికీ, ఆర్థిక సరళీకృత విధానాలకూ, తీవ్రవాదానికీ సంబంధం ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ సాయినాథ్‌ పరిశోధనలో ఈ మూడింటికీ సంబంధం ఉందని తేలింది. తెల్లవారు జామున ఏ మూడింటికో కరెంటు ఇస్తోంది ప్రభుత్వం. మోటారు స్విచ్‌ వేయడానికి రాత్రిళ్లు పొలానికి వెళ్లిన రైతులు పాముకాటుకు గురైతే విరుగుడు మందు దొరకట్లేదు. పీపుల్స్‌వార్‌ నుంచి ఎల్టీటీఈ దాకా పాముకాటు మందును పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడమే దానికి కారణమని తేలింది. ఈ చేదునిజం గురించి 2001లో ఆయన రాసిన కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైంది.
***
'ముంబాయిలో లాక్మే ఫ్యాషన్‌షో జరిగితే అధిక సంఖ్యలో అక్రిడేటెడ్‌ జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ పత్రికలు, టెలివిజన్‌ ఛానళ్లలో ప్రముఖంగా ప్రచారం ఇచ్చారు. కనీస వేతనాల కోసం లక్షల మంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు' అంటూ నిశితంగా విమర్శించారు. భారతదేశంలోని పత్రికలు పైనున్న ఐదుశాతం మంది గురించి పట్టించుకుంటే, తాను కింది నుంచి ఐదుశాతం మంది కోసం రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు.
***
అలాగే... 'బీహార్‌లోని గొడ్డా జిల్లా లాల్మతియా గ్రామంలో ఓ వ్యక్తి మూడు బొగ్గుమూటల్ని సైకిల్‌మీద పెట్టుకొని అతి కష్టంగా లాక్కుని వెళ్తున్నాడు. మూడు క్వింటాళ్ల బరువుంటాయవి. అతనికి సాయం చేద్దామని ఐదునిమిషాలు తోయగానే అలసిపోయాన్నేను. కానీ అదే బరువుతో రోజూ 40కి.మీ. దూరం ప్రయాణించి వాటిని అమ్ముకుంటాడు అతను. అందుకు ముట్టే ప్రతిఫలం రూ.10. ఆ ప్రాంతంలో దాదాపు మూడువేల మందికి అదే ఆధారం' అని చెబుతారు సాయినాథ్‌. వినడానికే గుండెలు తరుక్కుపోయే ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూశారాయన. ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, పదును ఆ కలంలో కనిపిస్తాయంటే ఆశ్చర్యమేముందిక!

courtesy: http://www.abbineniguntapalem.com/chandvandi

Friday, April 2, 2010

నీళ్ళు ఐపోయాయి బాబూ !




ప్రియ బ్లాగర్లకు,

సర్ మీలో సమాజ సేవ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. మీకందిరికి ఓ విన్నపం. మీ ఈ పోస్ట్ చదవి ఇప్పటికైనా నీటి పొడుపు మొదలు పెట్టండి. మీ పొరుగు వాళ్ళను ఈ విషయం లో మేల్కొనేలా చేయండి. ఒకరిని చూసి ఒకరు మారితే సమాజమే మారుతుంది.


రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పరిమితికి మించి నీటి వినియోగం జరుగుతుండటంతో పరిస్థితి ముప్పు స్థాయికి చేరుతోంది. కొన్నాళ్లు అనావృష్టి.. మరికొన్నాళ్లు వర్షాలతో ఏటా భూగర్భ జలాలు ఎంతోకొంత పెరుగుతున్నా వాటిని ఇష్టానుసారంగా తోడేయడంతో భూగర్భ జలాలు ఒట్టిపోతున్నాయి. అందుబాటులో ఉన్న నీటి వనరులను నూటికి నూరుశాతం వాడుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. భూగర్భ జల వనరులశాఖ అధికారులు భూగర్భ జలాలపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

** భూగర్భ జలాలను తోడటంలో రాయలసీమ పరిమితిని దాటింది. సాగునీటి వనరులు లేనిచోట్ల భూగర్భ జలాలను ఏకంగా 76 శాతం వాడారు.


** అనంతపురం జిల్లాలో 11,745 ఎంసీఎం జలాలు అందుబాటులో ఉంటే అందులో 10,522 ఎంసీ ఎంలు (90 శాతం) మేర భూగర్భ జలాలను వినియోగించారు.


** తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం 51 శాతం ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 25 శాతం వరకు మాత్రమే ఉంది.


** రాష్ట్రంలోని 111 మండలాల్లో అందుబాటులోని జలాలను నూటికి నూరుశాతం తోడేయటంతో అధికారులు వాటిని డేంజర్‌ జోన్‌ జాబితాలో చేర్చారు. అందులో రాయలసీమలోని 57 మండలాలు ఉండగా, తెలంగాణ ప్రాంతంలోనివి 44 ఉన్నాయి.


** ఆంధ్ర ప్రాంతంలోని 10 మండలాలు ఈ జాబితాలో ఉండగా, వాటిలో ప్రకాశం జిల్లాలోనే ఐదు మండలాలున్నాయి.


నగరంలో జలాలు శూన్యం

భూగర్భ జలాల వినియోగంలో 'గ్రేటర్‌' డేంజర్‌ జోన్‌లో ముందు వరసలో నిలిచింది. అధికారులు తమ రికార్డుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 5,806 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు అందుబాటులో ఉంటే.. అందులో గ్రేటర్‌వాసులు ఏకంగా 5,737 ఎంసీఎంల నీటిని తోడుకున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినపుడు నీరు భూమిలో ఇంకే పరిస్థితులు లేకపోవడంతో ఉన్న వనరులను 99 శాతం వాడుకున్నారు. దీంతో ప్రస్తుతం భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం కేవలం 689 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో మరెక్కడా పరిస్థితి ఇంత దారుణంగా లేదు.