Pages

Friday, April 2, 2010

నీళ్ళు ఐపోయాయి బాబూ !




ప్రియ బ్లాగర్లకు,

సర్ మీలో సమాజ సేవ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. మీకందిరికి ఓ విన్నపం. మీ ఈ పోస్ట్ చదవి ఇప్పటికైనా నీటి పొడుపు మొదలు పెట్టండి. మీ పొరుగు వాళ్ళను ఈ విషయం లో మేల్కొనేలా చేయండి. ఒకరిని చూసి ఒకరు మారితే సమాజమే మారుతుంది.


రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పరిమితికి మించి నీటి వినియోగం జరుగుతుండటంతో పరిస్థితి ముప్పు స్థాయికి చేరుతోంది. కొన్నాళ్లు అనావృష్టి.. మరికొన్నాళ్లు వర్షాలతో ఏటా భూగర్భ జలాలు ఎంతోకొంత పెరుగుతున్నా వాటిని ఇష్టానుసారంగా తోడేయడంతో భూగర్భ జలాలు ఒట్టిపోతున్నాయి. అందుబాటులో ఉన్న నీటి వనరులను నూటికి నూరుశాతం వాడుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. భూగర్భ జల వనరులశాఖ అధికారులు భూగర్భ జలాలపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

** భూగర్భ జలాలను తోడటంలో రాయలసీమ పరిమితిని దాటింది. సాగునీటి వనరులు లేనిచోట్ల భూగర్భ జలాలను ఏకంగా 76 శాతం వాడారు.


** అనంతపురం జిల్లాలో 11,745 ఎంసీఎం జలాలు అందుబాటులో ఉంటే అందులో 10,522 ఎంసీ ఎంలు (90 శాతం) మేర భూగర్భ జలాలను వినియోగించారు.


** తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం 51 శాతం ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 25 శాతం వరకు మాత్రమే ఉంది.


** రాష్ట్రంలోని 111 మండలాల్లో అందుబాటులోని జలాలను నూటికి నూరుశాతం తోడేయటంతో అధికారులు వాటిని డేంజర్‌ జోన్‌ జాబితాలో చేర్చారు. అందులో రాయలసీమలోని 57 మండలాలు ఉండగా, తెలంగాణ ప్రాంతంలోనివి 44 ఉన్నాయి.


** ఆంధ్ర ప్రాంతంలోని 10 మండలాలు ఈ జాబితాలో ఉండగా, వాటిలో ప్రకాశం జిల్లాలోనే ఐదు మండలాలున్నాయి.


నగరంలో జలాలు శూన్యం

భూగర్భ జలాల వినియోగంలో 'గ్రేటర్‌' డేంజర్‌ జోన్‌లో ముందు వరసలో నిలిచింది. అధికారులు తమ రికార్డుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 5,806 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు అందుబాటులో ఉంటే.. అందులో గ్రేటర్‌వాసులు ఏకంగా 5,737 ఎంసీఎంల నీటిని తోడుకున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినపుడు నీరు భూమిలో ఇంకే పరిస్థితులు లేకపోవడంతో ఉన్న వనరులను 99 శాతం వాడుకున్నారు. దీంతో ప్రస్తుతం భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం కేవలం 689 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో మరెక్కడా పరిస్థితి ఇంత దారుణంగా లేదు.

1 comment:

  1. మీ పోస్టు చదివి వెంటనే మా బాత్ రూం లో లీకవుతున్న త్యాప్ ని మార్చడానికి ప్లంబర్ కి ఫోన్ చేశాను.ళక్కీగా అతను ఉంతున్న ఏరియాలో కర్ఫ్యూ లేకపోవడం వలన వెంటనే వచ్చి దాన్ని సరి చేసి పోయాడు.

    ReplyDelete