Pages

Wednesday, March 31, 2010

షాకింగ్ ప్రశ్నలు - బ్రేకింగ్ జవాబులు ! (విటుడు - వేశ్య)

వేశ్యా వృత్తి దురాచారాన్ని ఖండిస్తూ ప్రముఖ కవి కాళ్ళకూరి నారాయణరావు వందేళ్ల క్రితమే సందించిన బ్రహ్మాస్త్రం చింతామణి నాటకం. ఆ పుస్తకంలోని ఒక అద్బుతమైన పార్టే ఈ పోస్టు

బిల్వ అనే విజ్ఞానవంతుడైన విటుడి ప్రశ్నలకు చింతామణి ఇచ్చిన సమాధానాలు చదవండి

* అత్యంత సుందరమైనది ఏది?
@ ప్రకృతి
* అత్యంత భయంకరమైనది ఏది?
@ సంసారము
* మనల్ని ఎపుడూ విడువనిది?
@ ఆశ
* దేనిచేతను చావనిది ?
@ అహంకారము
* ఎంత దారిద్ర్యం లో ఉన్నా సుఖపెట్టగలిగేది ?
@ తృప్తి
* అన్నింటి కంటే బలమైనది?
@ అవసరం
* అన్నింటికంటే సుఖమైనది ఏది?
@ ఇతరులకు సలహా చెప్పుట
* అన్నింటి కంటే కష్ట సాధ్యమైనది ?
@ తన తప్పు తాను తెలుసుకొనుట
* పాపములన్నిటిని హరించేది ?
@ పచ్చాతాపం

4 comments:

  1. చివరి విషయం లో నేను దీనితో విబేధిస్తున్నాను. చేసే వెధవ పనులన్నీ చేసి చివరికి పశ్చాత్తాప పడితే, ఆ చేసిన వెధవ పనుల ఫలితమంతా ఎవరు భరిస్తారు.
    రాజీవ్ గాంధీ ని చంపటం లో పాత్ర పోషించిన నళిని ఇప్పుడు పశ్చాత్తాప పడుతోంది. కానీ ఒక జాతీయ నాయకుడిని పోట్టబెట్టుకున్న పాపం నుంచీ ఆమె ఎలా తప్పించుకొంటుంది?
    రాజకీయ నాయకులంతా అవినీతి చేసి, చివరికి చనిపోయే ముందు ఏ మత గురువు ప్రభావం వలననో బుధ్ధి వచ్చి పశ్చాత్తాప పడ్డరనుకోండి...దాని వలన వారి పాపం ఎందుకు హరించబడాలి.
    ఏ ప్రైవేటు సంస్థ లో అయినా నువ్వు ఒక సంవత్సరం బాగా పనిచేస్తే ఆ సంవత్సరం నీకు మంచి జీతం ఇస్తారు. రెండో సంవత్సరం పని చేయకపోతే జీతం తగ్గుతుంది. ఇదీ అలానే ఉండాలి. మనిషి చేసిన వెధవ పనికి శిక్షించబడాలి. తరువాత రిగ్రెట్ అయితే జీతం పెంచటం సరి కాదు .

    ReplyDelete
  2. Rambondalapati garu.. I fully agree with you

    -thank you

    ReplyDelete
  3. Getting punished for a sin/crime/mistake is the result of it. 'Paschattapamu' is the realization after committing it. When a person gets into this mode, there is no higher punishment than that.

    I will try to explain with a simple example. Let us assume, you broke a crystal gift article, that your mother chersished and that she has some emotional factor attached to it. At the age of breaking, you don't realize the emotions behind it, but you just wanted to see it and accidentally broke it. Now your mom could scold you, cane you or give some punishment. But she could never forget the loss. Now, when you growup and realize the associated emotions behind the gift article, it is not the crystal you disturbed, but the emotions of your mom, you will feel bad. And this feeling is 'Paschattapamu' and you can do nothing about it, but that keeps buring from inside until death. That is why it is said, 'Paschattapamu' is the highest punishment.

    Regards

    Seetharamam

    ReplyDelete