ఒక యూనిట్ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి
* తాతల కాలం నాటినుంచీ వాడుతున్న బల్బులకు 60 వాట్‌లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్‌ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్ ల్యాంపుల(సీఎఫ్‌ఎల్)కు 11-15 వాట్‌లు అయితే సరిపోతుంది. రాష్ట్రంలో రెండు కోట్ల పాతకాలం బల్బులను తీసేసి సీఎఫ్‌ఎల్ లాంటి దీపాలు పెడితే ఏటా వెయ్యి మెగావాట్లు కరెంటు ఆదా చేసినట్లే.
* చౌక్ ఉన్న ట్యూబ్‌లైట్‌ల(55 వాట్) స్థానంలో చౌక్ లేకుండా పనిచేసే కోటిన్నర సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే ఏటా 500 మెగావాట్లు దుబారాను నివారించవచ్చు.
* కొత్తగా ఎల్‌ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు.
* సాధారణ జెట్ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. 20 లక్షల పంపుసెట్లు మార్చినా ఏడాదికి 70 కోట్ల యూనిట్లు కరెంటు మిగిలినట్లే.
* చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్‌లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.
మంచి కాఫీలాంటి పోస్ట్
ReplyDeleteమంచి విషయాలు చెప్పారు.థాంక్యు
ReplyDelete