Pages

Friday, May 13, 2011

షేర్ మార్కెట్ గురించి ఓ చిన్న అవగాహన



నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ), బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ)లలో షేర్ల ధరల్లో ఉన్న వ్యత్యాసం ద్వారా ప్రయోజనాన్ని పొందడాన్నే ఆర్బిట్రేజ్‌ అంటారు.


$ షేర్లను కొన్నప్పుడు సాధారణంగా మూడు రోజుల్లో (కొన్న రోజు + 2 రోజులు) మీ డీమ్యాట్‌ ఖాతాలో ఆ షేర్లు జమ అవుతాయి. కొన్ని సందర్భాల్లో ఇంతకన్నా ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. డీమ్యాట్‌ ఖాతాలోకి షేర్లు రాకున్నా అదే ఎక్స్ఛేంజీలో వెంటనే అమ్ముకోవచ్చు. దీన్నే ఇంట్రాడే ట్రేడింగ్‌ అంటారు. అయితే, అది కూడా ఎ, బి గ్రూపులోని షేర్లకు మాత్రమే పరిమితం. 'టి' గ్రూపులో ఉండే షేర్లను కొన్నప్పుడు అవి డీమ్యాట్‌ ఖాతాలో జమ అయ్యేంత వరకూ ఆగాల్సిందే.

$ ఒక ఎక్స్ఛేంజీలో షేర్లు కొని మరొక దాంట్లో ఒకే రోజులో అమ్మడం కూడా సాధ్యం కాదు. డీమ్యాట్‌ ఖాతాలో ఉన్న షేర్లకే ఇది వర్తిస్తుంది.

$ ఇక ఆర్బిట్రేజ్‌ వల్ల ఫలితం ఏంటంటే..

ఉదాహరణకు మీ డీమ్యాట్‌ ఖాతాలో 'ఎక్స్‌' కంపెనీ షేర్లు వెయ్యి ఉన్నాయనుకుందాం. ఈ షేరు ధర బీఎస్‌ఈలో రూ. 150, ఎన్‌ఎస్‌ఈలో రూ. 140 ఉందనుకుందాం. అప్పుడు బీఎస్‌ఈలో రూ. 150కి అమ్మి, అవే షేర్లను ఎన్‌ఎస్‌ఈలో రూ. 140 చొప్పున కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల షేర్లు అలాగే ఉండటంతో పాటు దాదాపు రూ. 10వేల దాకా ఆదాయం వస్తుందన్నమాట.

స్టాక్‌ మార్కెట్లో షేర్లను అమ్మడానికి, కొనడానికి సరైన సమయం ?

$ మార్కెట్‌ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ హించలేరు. అందువల్ల షేర్లు కొనడానికి, అమ్మడానికి సరైన సమయం ఇదంటూ కచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే.. కొన్ని విషయాల ఆధారంగా షేర్లు ఎప్పుడు కొనాలి.. ఎప్పుడు అమ్మాలి అనేది నిర్ణయించుకోవచ్చు.

$ స్టాక్‌ మార్కెట్లో ట్రేడింగ్‌ చేసేవాళ్లు నష్టభయం భరించే స్థోమతను బట్టి, ఒక షేరులో వచ్చే సాంకేతిక మార్పులను పరిగణనలోనికి తీసుకొని అమ్మడం కొనడం చేయాలి. నష్ట పరిమితి కచ్చితంగా విధించుకోవాలి. అనుకున్న రాబడి వస్తే వెంటనే ఆ షేర్లను అమ్మేసుకోవాలి.

$ ఇక దీర్ఘకాలిక పెట్టుబడి దృక్పథంతో కొనుగోలు చేసేవారు.. కంపెనీ ఫండమెంటల్స్‌ను జాగ్రత్తగా గమనించాలి. ఒక కంపెనీలో షేర్లు కొంటున్నామన్న ధోరణితో కాకుండా.. ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నామన్న ఆలోచనతో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడిని అందిస్తాయన్న సంగతిని మర్చిపోకూడదు. అందుకే, కంపెనీ వృద్ధి నమోదు చేస్తున్నంత కాలం, లేదా మీకు ఆ డబ్బుతో అవసరం లేనన్ని రోజులు మదుపును కొనసాగించాలి. మంచి కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి వచ్చినప్పుడు కొనాలి.

2 comments:

  1. ఎన్‌ఎస్‌ఈలో అమ్మి, అవే షేర్లను బీఎస్‌ఈలో కొనుగోలు చేయవచ్చు



    Make Money Online : http://ow.ly/KNICZ

    Make Money Online : http://ow.ly/KNICZ

    Make Money Online : http://ow.ly/KNICZ

    ReplyDelete
  2. ఎన్‌ఎస్‌ఈలో అమ్మి, అవే షేర్లను బీఎస్‌ఈలో కొనుగోలు చేయవచ్చు



    Make Money Online : http://ow.ly/KNICZ

    Make Money Online : http://ow.ly/KNICZ

    Make Money Online : http://ow.ly/KNICZ

    ReplyDelete