Wednesday, December 15, 2010
Monday, December 6, 2010
Friday, November 26, 2010
డిగ్రీ ఉంటే ఉద్యోగం
అవును ఇది నిజం.
జెకెసి ద్వారా జీవీకె ఆద్వర్యంలో నదుపుతున్న 108 విభాగంలో ఖాళీలు పడ్డయి.
ఆసక్తి పరులు ఈ న్యూస్ చదవండి.
JKC conducting recruitment for GVK-EMRI 108...
Jawahar Knowledge Center is conducting a recruitment drive for GVK-EMRI 108 at the Government City College in the Hyderabad old city on November 30.
Eligiblity: Candidates who have graduated in BA, B.Com and B.Sc in the year 2006 and later are eligible to attend the drive being held for the post of Communication Officer. Age: Candidates less than 30 years have to attend the drive with all their original certificates. Details can be had on 9700066635 and 9949762601, according to a press release.(Hindu)

Wednesday, November 24, 2010
కొత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

Andhra Pradesh Assembly Speaker Kiran Kumar Reddy will be sworn-in as the new Chief Minister of the State on Thursday, senior Congress leader Pranab Mukherjee said after a meeting of the Congress Legislature Party in Hyderabad.
“Congress president Smt. Sonia Gandhi has selected Kiran Kumar Reddy as the new leader of the Congress Legislature Party. He will be sworn-in tomorrow by the Governor as the new Chief Minister of Andhra Pradesh,” Mr. Mukherjee said in a brief statement.
www.namastheandhra.com
Saturday, October 2, 2010
క్యూట్ కల్యాణి .. విత్ మల్లెపూలు ! డౌన్లోడ్ ఫ్రీ !
Tuesday, September 28, 2010
Thursday, September 23, 2010
నన్ను అలరించిన వార్త (అడల్ట్ ఓన్లీ )
కామన్ వెల్త్ గేమ్స్ లో కండోం ల గోల !!
వీలైతే చదవండి.. ఇది లింక్
http://namastheandhra.com/newsdetails.asp?newsid=13201
Friday, September 10, 2010
Monday, September 6, 2010
వీడు మనిషంటే !
ఒక వ్యక్తి చాలా కస్టపడి సంపాదించుకున్న సొమ్ముతో రెండస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు. కింద అంగడి పైన నివాసం. కింది అంతస్తులో వ్యాపారం పెట్టుకున్నాడు. ఒకరోజు.. అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న బట్టలు, ఫర్నిచర్, వస్తువులు అన్ని కాలిపోయాయి. కింద దుకాణం లో ఉన్న సరుకులు, డబ్బులు అన్ని బూడిదయ్యాయి. మరుసటి రోజు కాలిపోయిన ఇంటి ముందు ఆటను ఓ సైన్ బోర్డ్ పెట్టాడు. దాని మీద ఇలా రాసాడు.
**
దుకాణం కాలిపోయింది
సరుకులు బూడిదయ్యాయి
తిండి గింజలు మాడిపోయాయి
అన్నీ కాలిపోయిన నా మీద నాకున్న నమ్మకం కాలిపోలేదు.
రేపటి నుంచి యదావిదిగా విడిగా నా వ్యాపారం ప్రారంబిస్తా !
***

Friday, August 20, 2010
తెలుగు టైపింగ్ తెలిసిన కావలెను
తెలుగు టైపింగ్ , ఫోటో షాప్ లో బేసిక్స్
తెలిసిన పర్సన్ కావలెను. పని గంటలు తక్కువ .
పనికి తగిన వేతనం ఇవ్వబడును .
పని ప్రాంతం మాసాబ్ ట్యాంక్ .
ఆసక్తి పరులు ఫోన్ చేయగలరు
ప్రకాష్
99482 99593

Tuesday, August 3, 2010
నేను ఒక పొరపాటు చేశాను !!

జీవితం అంటే ఏమిటి? చాలా రోజులుగా ఈ ప్రశ్న నాలో మెదులుతోంది. కాని నాలో తలెత్తిన ఈ ప్రశ్నకు నేను పుట్టక ముందే సమాధానం సిద్దంగా ఉంది.
సమాధానం "శంకరాభరణం" !!
30 సంవత్సరాల తర్వాత శంకరాభరణం సినిమా చూశాను. అధే నేను చేసిన పొరపాటు.
కదిలించే సినిమాలు చాలా వస్తాయి. కాని మనల్ని మెల్కొలిపే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. 30 సంవత్సరాల కింద విడుదలైన సినిమ గురించి ఈరోజు చెప్పడం మీకు వింతగా అనిపించవచ్చు.
ఒక విషయం గుర్తుంచుకోండి. ప్రతి రోజు విగ్నానం పెరగకపోవచ్చు. కాని, మన విచక్షణాశక్తి పెరుగుతుంది.
ఇది ఒకసారో, లేదా ఒకేసారో చూసే సినిమా కాదు. ప్రతి సంవత్సరం చూడొచ్చు. ఇంకా చెప్పాలంటే ప్రతి నెలా చూడొచ్చు.
జీవితం అంటే కూడు, గూడు, గుడ్డ తగినంత దొరకడమే కాదు.
ప్యూరిటీ ఆఫ్ లివింగ్
ప్యూరిటీ ఆఫ్ థింకింగ్
ప్యూరిటీ ఆఫ్ టాకింగ్
ప్యూరిటీ ఆఫ్ హెల్పింగ్
ప్యూరిటీ ఆఫ్ ఎజుకేషన్
ప్యూరిటీ ఆఫ్ ఇన్స్పైరింగ్
ఇదీ జీవితం.
వీటిని ఈ సినిమా నేర్పుతుంది.
ఆ సినిమా ఒక పుస్తకం. ఒక సంప్రదాయం. ఒక విద్య. ఒక జీవితం. ప్రతి జీవితం లో మనల్ని తనువై, మనసై ప్రేమించే మనిషి ఉండాలి.
అంటే జీవితానికి ఒక తులసి (మంజుభార్గవి క్యారెక్టర్) ఉండాలి. నేను చెబుతున్నది స్త్రీ గురించి కాదు. అలాంటి నిష్కల్మషమైన ప్రేమ గురించి.
మనం లేని ఈలోకాన్ని ఊహించుకోలేనంతటి ప్రేమను పంచాలి.
దానికి ఒకటే మార్గం. వేరేవల్ల ప్రేమను కోరకండి. మీరు ప్రేమించండి. ఎదుటివాళ్లు తట్టుకోలేనంతటి ప్రేమను పంచండి.
జీవితంలో మన అవసరాలు తీరడం కాదు గొప్ప.
మనల్ని ప్రేమించే వాళ్లు దొరకడం.
వాళ్లు దొరకాలంటే ముందు అలాంటి ప్రేమను మనం పంచాలి.
ప్రేమ ఒక విత్తు.
ఒక్కసారి నాటండి.. మీ జీవితానికి సరిపడా చల్లటి ప్రేమను ఇస్తుంది.
my new blog
www.indianloversleague.blogspot.com
Thursday, June 3, 2010
అనుబందాలను తెలిపే ఐదు రొమాంటిక్ సినిమాలు
Monday, May 17, 2010
Tuesday, May 11, 2010
కొన్ని పెళ్లి మంత్రాలు - అర్థాలు
కన్యాదానం సమయంలో...
కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతామ్!
దాస్వామి విష్ణవే తుభ్యం
బ్రహ్మలోక జిగీషయా!!
బ్రహ్మలోక ప్రాప్తికోసం నేను సువర్ణ సంపద గల, స్వర్ణాభరణ భూషిత అయిన ఈ కన్యను లక్ష్మీనారాయణ స్వరూపుడివైన నీకు దానం చేయబోతున్నాను.
సుముహూర్తంలో...
(జీలకర్ర బెల్లం పెట్టే సమయం)
అస్య ముహూర్తస్య సుతిథిం సువారం
సునక్షత్రం సు యోగం సుకరణం
సుచంద్ర తారాబలం అనుకూలం
శుభశోభనాస్సర్వేగ్రహః సునక్ష త్రాః
శుభై కాదశస్థాన ఫలదాః సుప్రీతాః
సుముహూర్తాః సుప్రసన్నా వరదాః భవంతు
ఈ ముహూర్తమునకు మంచి తిథిని మంచి వారమును మంచి నక్షత్రమును మంచి యోగమును మంచి కరణమును మంచి చంద్రతారాబలమును అనుకూలముగా చేసి శుభములు శోభనములునయి అన్ని గ్రహములును ఫలము నిచ్చునవై మంచి ప్రీతి గలవై సుముహూర్తములు గలవై సుప్రసన్నతగలవై వరములనిచ్చునవై అవుగాక.
మాంగల్య ధారణలో...
మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా!
కంఠే బధ్నామి సుభగే! త్వంజీవ శరదాం శతమ్!!
నా సుఖ జీవనానికి హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు వర్ధిల్లు!
వధువు వరునితో ఏడడుగులు వేసే ముందు ...
saప్తపది జరిగిన తర్వాత వధువు గోత్రం వరుని గోత్రంగా మారిపోతుంది. తన వెంట ఏడడుగులు నడిచే వధువుని ఉద్దేశించి వరుడు జపించే మంత్రాలివి.
ఏకమిషే విష్ణుస్తా వన్వేతు, ద్వే ఊర్ఙే విష్ణుస్త్వా న్వేతు.
మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు.
త్రీణి వ్రతాయ విష్ణుస్త్వా నేతు. చత్వారి
మయో భవాయ విష్ణుస్త్వా న్వేతు.
పంచ పశుభ్యో విష్ణుస్త్వా న్వేతు. షడృతుభ్యో విష్ణుస్త్వా న్వేతు.
సప్త హోత్రాభ్యో విష్ణుస్త్వా న్వేతు
ఓ చిన్నదానా! నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి నీవు వేసే మొదటి అడగువల్ల అన్నాన్ని, రెండవ అడుగువల్ల బలాన్ని, మూడో అడుగువల్ల మంచి కార్యాలను, నాల్గో అడుగువల్ల సౌఖ్యాన్ని, ఐదో అడుగువల్ల పశుసమృద్ధిని, ఆరో అడుగువల్ల ఋతు సంపదలను, ఏడో అడుగువల్ల ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక.
సఖా సప్తపదా భవ. సఖాÄౌ సప్తపదా బభూవ. సఖ్యంతే
గమేయం. సఖ్యాల్తే మా యోషం. సఖ్యాన్మే మా యోష్ఠాః
సమయావ. సంకల్పావ హై. సంప్రిÄౌ రోచిష్ణూ
సుమనస్యమానౌ ఇష మూర్జ మభి సంవసానౌ సం నౌ
మనాంసి సంవ్రతా సముచిత్తాన్యకరమ్
నాతో ఏడడుగులు నడచి నాకు మంచి స్నేహితురాలివి కావాలి. మనమిద్దరం కలిసి ఏడడుగులు నడిస్తే స్నేహితులమౌతాం. అప్పుడు నేను నీ స్నేహాన్ని ప్రేమను పొందుతాను. నీ స్నేహాన్నుంచి ఎన్నటికీ వియోగం పొందను. నా స్నేహాన్నుంచి నీ వెన్నడూ వియోగం పొందకు! పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ, నిండు మనస్సుతో ఆహారాన్ని, బలాన్ని పొందుతూ కలసి ఉందాం. కలసి ఆలోచించుకుందాం. మన మనస్సులు కలిసేలా నడుచుకుందాం. అలాగే అన్ని నియమాల్లోనూ బాహ్యేంద్రియాలు కూడా కలిసి ఉండేటట్లు నడుచుకుందాం.
***
అరుంధతీ నక్షత్రం
వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ నక్షత్రాన్నీ చూపిస్తారు.
ధృవనక్షత్రంలా వారు నిశ్చలమైన మనస్తత్తా ్వలతో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత కావాలనే ఆకాంక్ష ఇందులో కలదు.

Friday, April 16, 2010
అమెరికాలో (మేరి ల్యాండ్) ఉచిత వైద్యశాల !
డాక్టర్స్ కమ్యునిటీ హాస్పిటల్ పేరుతో అమెరికాలోని కొందరు ప్రముక డాక్టర్లు నాన్ - ఫ్రాఫిట్ ఆస్పత్రిని నెలకొల్పారు.
ఈ వివరాలు మీరు స్వయంగా, పూర్తిగా లింకుల ద్వారా తెలుసుకోవచ్చు.
http://www.dchweb.org/dch/about/index.html
for doubts fallow this link
http://www.dchweb.org/dch/about/faq.html

Monday, April 12, 2010
Monday, April 5, 2010
నాకు ప్రియురాలు వద్దు ! మరి మీకు
కంప్యూటర్లూ, సాఫ్ట్వేర్ల గురించి మాత్రమే అంతా ఆలోచిస్తున్న ఈ ఆధునిక యుగంలో... ప్రియురాలి వంటి పట్నాన్నే కాదు... తల్లివంటి పల్లెను కూడా తలచుకోవాల్సిన అవసరం ఉందనుకున్నాడో వ్యక్తి! అనుకోవడమే కాదు, అకుంఠిత దీక్షతో నెలల తరబడి గ్రామాల వెంట తిరిగాడు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లాడు. అందుకు కారణమైన లోతుల్ని తరచిచూశాడు. అక్షరబద్ధం చేశాడు. పాలకుల, ప్రజల దృష్టికి తెచ్చాడు. ఆయనే పాలగుమ్మి సాయినాథ్..రామన్ మెగసెసే అవార్డు విజేత.
* * *
ప్రఖ్యాతిగాంచిన ఆర్థిక వేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ మాటల్లో చెప్పాలంటే ఆకలి, దుర్భిక్షంపై ప్రపంచంలోనే అత్యంత లోతుగా అధ్యయనం చేసిన నిపుణుల్లో సాయినాథ్ ఒకరు.
***
'దేశం మొత్తం మీదా గత పదేళ్లలో దాదాపు లక్ష మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ అందుకు కారణమైన ఒక్క అధికారికి కూడా కనీస శిక్షపడలేదు' అన్న సాయినాథ్ మాటలు కఠినంగా అనిపించొచ్చుగానీ అవి అక్షర సత్యాలు.
***
ఇన్ని మాటలెందుకు... పాలమూరు వలసలూ, అనంతపురంలో రైతుల ఆత్మహత్యలూ అంతర్జాతీయ సమాజం దృష్టికి రావడానికి ఆయన రచనలే కారణం. వలస కూలీలుగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా రైతులు 2000సంవత్సరంలో వారానికి ఒక బస్సులో ముంబాయి వెళ్లేవారు. 2004కి ఆ సంఖ్య 34బస్సులకు పెరిగింది. ఈ విషయాన్ని గుర్తించి ప్రపంచానికి చెప్పింది సాయినాథే.
***
పాముకాటుతో రైతులు మరణించడానికీ, ఆర్థిక సరళీకృత విధానాలకూ, తీవ్రవాదానికీ సంబంధం ఉందంటే ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ సాయినాథ్ పరిశోధనలో ఈ మూడింటికీ సంబంధం ఉందని తేలింది. తెల్లవారు జామున ఏ మూడింటికో కరెంటు ఇస్తోంది ప్రభుత్వం. మోటారు స్విచ్ వేయడానికి రాత్రిళ్లు పొలానికి వెళ్లిన రైతులు పాముకాటుకు గురైతే విరుగుడు మందు దొరకట్లేదు. పీపుల్స్‌వార్ నుంచి ఎల్టీటీఈ దాకా పాముకాటు మందును పెద్దఎత్తున కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవడమే దానికి కారణమని తేలింది. ఈ చేదునిజం గురించి 2001లో ఆయన రాసిన కథనం అంతర్జాతీయంగా ప్రచురితమైంది.
***
'ముంబాయిలో లాక్మే ఫ్యాషన్‌షో జరిగితే అధిక సంఖ్యలో అక్రిడేటెడ్ జర్నలిస్టులు హాజరయ్యారు. జాతీయ పత్రికలు, టెలివిజన్ ఛానళ్లలో ప్రముఖంగా ప్రచారం ఇచ్చారు. కనీస వేతనాల కోసం లక్షల మంది వ్యవసాయ కూలీలు ఢిల్లీలో ఆందోళన చేస్తే ఎవరూ పట్టించుకోలేదు' అంటూ నిశితంగా విమర్శించారు. భారతదేశంలోని పత్రికలు పైనున్న ఐదుశాతం మంది గురించి పట్టించుకుంటే, తాను కింది నుంచి ఐదుశాతం మంది కోసం రాస్తానని బహిరంగంగానే ప్రకటించారు.
***
అలాగే... 'బీహార్‌లోని గొడ్డా జిల్లా లాల్మతియా గ్రామంలో ఓ వ్యక్తి మూడు బొగ్గుమూటల్ని సైకిల్‌మీద పెట్టుకొని అతి కష్టంగా లాక్కుని వెళ్తున్నాడు. మూడు క్వింటాళ్ల బరువుంటాయవి. అతనికి సాయం చేద్దామని ఐదునిమిషాలు తోయగానే అలసిపోయాన్నేను. కానీ అదే బరువుతో రోజూ 40కి.మీ. దూరం ప్రయాణించి వాటిని అమ్ముకుంటాడు అతను. అందుకు ముట్టే ప్రతిఫలం రూ.10. ఆ ప్రాంతంలో దాదాపు మూడువేల మందికి అదే ఆధారం' అని చెబుతారు సాయినాథ్. వినడానికే గుండెలు తరుక్కుపోయే ఇలాంటి ఎన్నో దృశ్యాలను చూశారాయన. ఆ ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం, పదును ఆ కలంలో కనిపిస్తాయంటే ఆశ్చర్యమేముందిక!
courtesy: http://www.abbineniguntapalem.com/chandvandi

Friday, April 2, 2010
నీళ్ళు ఐపోయాయి బాబూ !

ప్రియ బ్లాగర్లకు,
సర్ మీలో సమాజ సేవ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. మీకందిరికి ఓ విన్నపం. మీ ఈ పోస్ట్ చదవి ఇప్పటికైనా నీటి పొడుపు మొదలు పెట్టండి. మీ పొరుగు వాళ్ళను ఈ విషయం లో మేల్కొనేలా చేయండి. ఒకరిని చూసి ఒకరు మారితే సమాజమే మారుతుంది.
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పరిమితికి మించి నీటి వినియోగం జరుగుతుండటంతో పరిస్థితి ముప్పు స్థాయికి చేరుతోంది. కొన్నాళ్లు అనావృష్టి.. మరికొన్నాళ్లు వర్షాలతో ఏటా భూగర్భ జలాలు ఎంతోకొంత పెరుగుతున్నా వాటిని ఇష్టానుసారంగా తోడేయడంతో భూగర్భ జలాలు ఒట్టిపోతున్నాయి. అందుబాటులో ఉన్న నీటి వనరులను నూటికి నూరుశాతం వాడుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. భూగర్భ జల వనరులశాఖ అధికారులు భూగర్భ జలాలపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.
** భూగర్భ జలాలను తోడటంలో రాయలసీమ పరిమితిని దాటింది. సాగునీటి వనరులు లేనిచోట్ల భూగర్భ జలాలను ఏకంగా 76 శాతం వాడారు.
** అనంతపురం జిల్లాలో 11,745 ఎంసీఎం జలాలు అందుబాటులో ఉంటే అందులో 10,522 ఎంసీ ఎంలు (90 శాతం) మేర భూగర్భ జలాలను వినియోగించారు.
** తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం 51 శాతం ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 25 శాతం వరకు మాత్రమే ఉంది.
** రాష్ట్రంలోని 111 మండలాల్లో అందుబాటులోని జలాలను నూటికి నూరుశాతం తోడేయటంతో అధికారులు వాటిని డేంజర్ జోన్ జాబితాలో చేర్చారు. అందులో రాయలసీమలోని 57 మండలాలు ఉండగా, తెలంగాణ ప్రాంతంలోనివి 44 ఉన్నాయి.
** ఆంధ్ర ప్రాంతంలోని 10 మండలాలు ఈ జాబితాలో ఉండగా, వాటిలో ప్రకాశం జిల్లాలోనే ఐదు మండలాలున్నాయి.
నగరంలో జలాలు శూన్యం
భూగర్భ జలాల వినియోగంలో 'గ్రేటర్' డేంజర్ జోన్లో ముందు వరసలో నిలిచింది. అధికారులు తమ రికార్డుల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 5,806 మిలియన్ క్యూబిక్ మీటర్ల జలాలు అందుబాటులో ఉంటే.. అందులో గ్రేటర్‌వాసులు ఏకంగా 5,737 ఎంసీఎంల నీటిని తోడుకున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినపుడు నీరు భూమిలో ఇంకే పరిస్థితులు లేకపోవడంతో ఉన్న వనరులను 99 శాతం వాడుకున్నారు. దీంతో ప్రస్తుతం భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం కేవలం 689 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో మరెక్కడా పరిస్థితి ఇంత దారుణంగా లేదు.
Wednesday, March 31, 2010
షాకింగ్ ప్రశ్నలు - బ్రేకింగ్ జవాబులు ! (విటుడు - వేశ్య)
వేశ్యా వృత్తి దురాచారాన్ని ఖండిస్తూ ప్రముఖ కవి కాళ్ళకూరి నారాయణరావు వందేళ్ల క్రితమే సందించిన బ్రహ్మాస్త్రం చింతామణి నాటకం. ఆ పుస్తకంలోని ఒక అద్బుతమైన పార్టే ఈ పోస్టు
బిల్వ అనే విజ్ఞానవంతుడైన విటుడి ప్రశ్నలకు చింతామణి ఇచ్చిన సమాధానాలు చదవండి
* అత్యంత సుందరమైనది ఏది?
@ ప్రకృతి
* అత్యంత భయంకరమైనది ఏది?
@ సంసారము
* మనల్ని ఎపుడూ విడువనిది?
@ ఆశ
* దేనిచేతను చావనిది ?
@ అహంకారము
* ఎంత దారిద్ర్యం లో ఉన్నా సుఖపెట్టగలిగేది ?
@ తృప్తి
* అన్నింటి కంటే బలమైనది?
@ అవసరం
* అన్నింటికంటే సుఖమైనది ఏది?
@ ఇతరులకు సలహా చెప్పుట
* అన్నింటి కంటే కష్ట సాధ్యమైనది ?
@ తన తప్పు తాను తెలుసుకొనుట
* పాపములన్నిటిని హరించేది ?
@ పచ్చాతాపం

Sunday, March 28, 2010
చిన్నమార్పు... భారీ పొదుపు ! మీ ఇంటి కోసం !!
ఒక యూనిట్ కరెంటు పొదుపు రెండు యూనిట్ల కరెంటు ఉత్పత్తితో సమానం. కరెంటు పొదుపునకు అనేక మార్గాలున్నా పాటించడానికి మనసు రావడం లేదు. చిన్న చిన్న మార్పులతో ఎంత కరెంటు ఆదా చేయోచ్చో చూడండి
* తాతల కాలం నాటినుంచీ వాడుతున్న బల్బులకు 60 వాట్లు, ట్యూబ్‌లైట్లకు 36 వాట్ల కరెంటు అవసరం అవుతుంది. అదే కాంపాక్టు ఫ్లోరోసెంట్ ల్యాంపుల(సీఎఫ్ఎల్)కు 11-15 వాట్లు అయితే సరిపోతుంది. రాష్ట్రంలో రెండు కోట్ల పాతకాలం బల్బులను తీసేసి సీఎఫ్ఎల్ లాంటి దీపాలు పెడితే ఏటా వెయ్యి మెగావాట్లు కరెంటు ఆదా చేసినట్లే.
* చౌక్ ఉన్న ట్యూబ్లైట్ల(55 వాట్) స్థానంలో చౌక్ లేకుండా పనిచేసే కోటిన్నర సన్నటి ట్యూబ్‌లైట్లు బిగిస్తే ఏటా 500 మెగావాట్లు దుబారాను నివారించవచ్చు.
* కొత్తగా ఎల్ఈడీ దీపాలు వచ్చాయి. వీటికి ఒక వాట్ కరెంటు సరిపోతుంది. వీటిని బెడ్ ల్యాంప్‌లుగా 50 లక్షల పడక గదుల్లో వాడితే ఏటా 30 కోట్ల యూనిట్ల కరెంటు వినియోగాన్ని తగ్గించవచ్చు.
* సాధారణ జెట్ పంపులు వాడితే రోజుకి 2.25 యూనిట్లు ఖర్చవుతుంది. అదే సబ్ మెర్సిబుల్ పంపుసెట్లకు 1.25 యూనిట్లు సరిపోతుంది. 20 లక్షల పంపుసెట్లు మార్చినా ఏడాదికి 70 కోట్ల యూనిట్లు కరెంటు మిగిలినట్లే.
* చాలా ఇళ్లలో ఫ్యాన్లకు సాధారణ రెగ్యులేటర్లు ఉన్నాయి. వాటి స్థానంలో ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్లు బిగిస్తే 15 శాతం కరెంటు పొదుపు చేయొచ్చు.

Friday, March 26, 2010
భక్తుడి ప్రశ్న - దేవుడి లాజిక్ !
ఒక భక్తుడు భగవంతుణ్ని ప్రశ్నించాడట- 'స్వామీ! మా మిత్రుడికి అపారమైన ఐశ్వర్యాన్నిస్తున్నావు. విలాసాల్లో తేలిపోతున్నాడు. మరి నామీద దయలేదేమి?' అని. అందుకు భగవంతుడు- 'నాయనా! నీ మిత్రుడు ఐశ్వర్యమే కోరుకున్నాడు. ఇచ్చాను. సుఖశాంతుల ప్రస్తావన లేదు. అందుకే అవి ఇవ్వలేదు. నీపై కరుణ ఉన్నది. కనుక నేన్నీకు సంపదనివ్వక సంతృప్తినీ, సుఖశాంతుల్నీ ఇస్తున్నాను అని బదులిచ్చినట్లు కథ.
లోభి అయిన సంపన్నుడు సాగరం లాంటివాడు. దాహం తీర్చలేడు, సమాజానికి పనికిరాడు. దరిద్రుడైనా దానగుణమున్నవాడు చెలమ వంటివాడు. ఆప్తుల్ని ఆదుకొనే మానవోత్తముడు. శ్రమవెంట మనం పడాలి. సుఖం మన వెంట పడుతుంది. ధనహీనుడు దరిద్రుడు కాడు. భక్తిహీనుడే దరిద్రుడు. జ్ఞానహీనుడే దరిద్రుడు. సంస్కారహీనుడే దరిద్రుడు. అధార్మికుడే దరిద్రుడు. ఈ సత్యం గ్రహించగలిగితే- ధర్మబద్ధమైన ధనార్జనకే సంసిద్ధులమవగలం.

Wednesday, March 24, 2010
చురుకైన పిల్లలు పుట్టాలంటే.. ఏం చేయాలి ?

గర్భిణి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులు ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వీలైనంత వరకు వారిచేత ఏ పని చేయించకూడదు అనుకుంటారు. కానీ గర్భిణులు చలాకీగా తిరుగుతూ చిన్నచిన్న పనులు చక్కబెట్టుకోవడం వల్ల పుట్టబోయే పిల్లల్లో తెలివితేటలు అమోఘంగా ఉంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కెనడా యూనివర్సిటీకి చెందిన వైద్యులు ఆ విషయాన్నే తమ అధ్యయనం ద్వారా తేల్చి చెప్పారు.
గర్భిణులు వారానికి మూడుసార్లు వ్యాయామాలు చేయడం, సానుకూల ధోరణిలో ఆలోచనలు చేయడం వల్ల చురుగ్గా ఉండగలుగుతారు. వారేకాదు వారికి పుట్టబోయే పిల్లల్లోను చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పరిశీలనలు చెబుతున్నాయి. పాతికేళ్ల నుంచి ముప్ఫైఏళ్ల లోపు గర్భిణుల ఆహారపు అలవాట్లు, దినచర్యలు గమనించాక ఈ విషయం స్పష్టమైంది. మంచి ఆహారం అంటే చేపలు, తృణధాన్యాలు.. పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకున్న వారే ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారు. అయితే గర్భిణుల వ్యాయామాలకు అధిక శ్రమ పనికిరాదు. వైద్యుల సలహాతోనే వాటిని చేయాల్సి ఉంటుందని గుర్తించుకోవాలి. కొందరికి వ్యాయామం చేసేప్పుడు శరీరం సహకరించదు. ఇతరత్రా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అవన్నీ ఆ వ్యాయామం మీకు సరిపడదని తెలిపే సంకేతాలు. వాటిని గమనించి తక్షణం ఆపేయాలి. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలోనే ఈ వ్యాయామాన్ని పూర్తి చేసుకోవడం మంచిది.
Friday, March 19, 2010
Monday, March 15, 2010
Friday, March 12, 2010
నాకు పెళ్లయ్యేలా చూడుస్వామీ!
చిలుకూరు బాలాజీ గుడికెళ్తే వీసా త్వరగా దొరుకుతుందంటారు. పిల్లలు పుట్టని వాళ్లు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తారు. మరి, ముప్పైలు దాటిపోతున్నా పెళ్లి కాని వారి కోసం అలాంటి ప్రత్యేక ఆలయాలేవైనా ఉన్నాయా అంటే... తమిళనాడులో అలాంటివి పదకొండు గుళ్లు ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి చుట్టబెట్టేలా ఆ రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేకంగా ఓ ప్యాకేజీనే ఏర్పాటు చేసింది.
'తిరుమణ తిరుతల సుట్రుల్లా'
తమిళనాడులో ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలూ అబ్బాయిలు పఠిస్తున్న తారకమంత్రం ఇది.
'కల్యాణ క్షేత్రాల పర్యటన' సదరు మంత్రానికి అచ్చతెలుగు అనువాదమిది. అనగా... వివాహాలకు అడ్డొచ్చే విఘ్నాలను తొలగించి త్వరగా పెళ్లయ్యేలా దీవించే దేవుళ్లున్న క్షేత్రాల పర్యటన అన్నమాట.
ఆలయాల గడ్డగా పేరొందిన అరవదేశంలో అలాంటివి పదకొండు గుడులు ఉన్నాయి. పెళ్లికాని వారంతా ఏవరికి వారు విడివిడిగా ఆయా క్షేత్రాలకు వెళ్లడం కద్దు. వారి అవస్థలు చూసిన టీటీడీసీ(తమిళనాడు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ .్మ్మ్ట్ఞ్న్థ్ద్ౖథ్ఠ.్ఞ్న్ఝ) ఈ ప్యాకేజీకి రూపకల్పన చేసింది.
ఏమేం ఆలయాలంటే...
మూడు రోజుల యాత్రలో భాగంగా తీసుకెళ్లే క్షేత్రాలివీ...
ముదిచూర్: తాంబరం (చెన్నై)లోని ముదిచూర్ ఆలయ దర్శనంతో యాత్ర వెుదలవుతుంది. హరిహరులిద్దరూ కొలువైన ఈ ఆలయంలో ప్రధాన దైవం విద్యాంబిగై అమ్మవారు. పెళ్లి కాని వారు ఈ గుడిలో ప్రార్థన చేస్తే త్వరగా కల్యాణయోగం సిద్ధిస్తుందని నమ్మిక.
తిరువిడనత్త్తె: మహాబలిపురం వద్ద వెలసిన లక్ష్మీవరాహస్వామి ఆలయం... తిరువిడనత్త్తె. ఇక్కడ అమ్మవారు కోమలవల్లీ తాయారు. త్రేతాయుగంలో కలవుడు అనే మహర్షికి పుట్టిన 360 మంది కూతుళ్లనూ విష్ణుమూర్తి వివాహమాడినట్టు స్థలపురాణం. వరాహరూపంలో సతీసమేతంగా కొలుటవైన ఈ స్వామిని నిత్యకల్యాణ పెరుమాళ్‌గా వ్యవహరిస్తారు భక్తులు.
తిరుమణంజేరి: శివుడు కల్యాణసుందరేశ్వరర్‌గా పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రం తిరుమణంజేరి. శివపార్వతుల కల్యాణం జరిగింది ఇక్కడేనని ప్రతీతి.
ఉప్పిలియప్పన్: అంటే ఉపమానాలకు అందనివాడు, అనుపమానుడు అని అర్థం. ఇది వైష్ణవక్షేత్రం. స్థానికుడైన మార్కండేయన్ అనే వ్యక్తికి పుట్టిన భూదేవి 'కోకిలాంబాళ్' పేరుతో పెరిగి శ్రీమహావిష్ణువును పెళ్లిచేసుకుందని ప్రతీతి. అందుకే ఈ ఆలయమూ కల్యాణాలకు ప్రసిద్ధి.
నాచ్చియార్ ఆలయం: విష్ణుమూర్తి నరైయూరు నంబిగా అమ్మవారు నాచ్చియార్‌గా కొలువైన దేవళం ఇది. విష్ణుమూర్తి 108 దివ్య దేశాల్లో ఒకటి.
తిరుకరుకావూర్: ఇక్కడి అమ్మవారు గర్భరక్షాంబిగై.పెళ్లికాని, పెళ్లయినా పిల్లలు పుట్టని మహిళలు ఈ తల్లిని దర్శించుకుంటారు. ఇక్కడి శివలింగం పుట్టమన్నుతో తయారైంది. అందుకే అభిషేకం చేయరు. పునుగు సుగంధ ద్రవ్యాన్ని మాత్రం అద్దుతారు.
తిరుచ్చేరై: ఇది కూడా 108 వైష్ణవ దివ్యదేశాల్లో ఒకటి. విష్ణువు శ్రీదేవీభూదేవీ సమేతంగా 'సారనాథుడు'గా కొలువుదీరిన క్షేత్రం. ఇక్కడ అమ్మవారు సారనాయకి. కావేరీ నది ఆ హరిని పెళ్లాడింది ఇక్కడేనని స్థలపురాణం.
మదురై: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం. పాండ్యరాజు తన కుమార్తె మీనాక్షిని చొక్కనాథుడైన శివుడికి ఇచ్చి పెళ్లి చేసిన చోటు. పెళ్లికాని అమ్మాయిలు మదుర మీనాక్షిని దర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
తిరునల్లూరు: శివుడు పంచవర్ణేశ్వరుడిగా కొలువైన క్షేత్రమిది. ఈ స్వామిని కల్యాణ సుందరేశ్వరుడిగా కొలుస్తారు భక్తులు. శివపార్వతుల కల్యాణాన్ని అగస్త్యుడు ఇక్కణ్నుంచే చూశాడని పురాణప్రవచనం.
తిరువేడగం: వైగై నదీ తీరాన కొలువుదీరిన శైవక్షేత్రమిది. ఇక్కడ స్వామిని ఏడగనాథర్ పేరుతో కొలుస్తారు. అమ్మవారు ఇలావర్ కులాలి అమ్మై.
తిరువీళిమిళలై: శివుడు కాత్యాయనీ దేవిని వివాహం చేసుకున్నట్టు చెప్పే పవిత్ర క్షేత్రమిది. ఇక్కడ ఈశ్వరుడు వీళినాథుడు.
ఎంత, ఎలా...
ఈ కల్యాణ క్షేత్రాల యాత్రకు రుసుము రూ.1800. మధ్యలో బసచేసే చోట హోటల్ గదిని ఇంకొకరితో కలిసి పంచుకుంటానంటే రూ.1400 సరిపోతాయి. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనం రుసుము అన్నీ అందులోనే. ప్రతి శుక్రవారం ఉదయం ఆరుగంటలకు చెన్నైలో టూరు వెుదలవుతుంది. మళ్లీ సోమవారం నాటికి అన్ని క్షేత్రాలూ దర్శించుకుని ఎక్కినచోటే దిగొచ్చు.
కొసమెరుపు: పర్యాటక శాఖవారు ఏ ఉద్దేశంతో ఈ టూరును ఏర్పాటు చేసినా పెళ్లికాని వారి ఆలోచనలు మాత్రం ఇంకో రకంగా ఉన్నాయి. 'అదృష్టం బాగుంటే... మనతోపాటే బస్సులో ఎక్కిన అమ్మాయో/అబ్బాయో ఈ మూడురోజుల్లో కాస్త దగ్గరై, ఆనక భాగస్వామి అయినా అయిపోవచ్చు కదా' అని ఆశపడుతున్నారు.
- courtesy : eenadu sunday

Monday, March 8, 2010
శనిశ్వరుడికి భయపడేవాళ్ళ కోసం ఈ పోస్ట్ !

శనిత్రయోదశి నాడు శనైశ్చరుని భక్తితో కొలిచినవారికి శుభాలనొసగుతాడనీ 'ఏలిననాటి శని దశ' వారిని అంతగా బాధించదనీ పురాణాలు చెబుతున్నాయి. (ఈ నెల పదమూడు శనిత్రయోదశి)
శనయే క్రమతి సః... నెమ్మదిగా చరించేవాడు శని అని పురాణోక్తి. శనిగ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించేందుకు పట్టే కాలం 30 సంవత్సరాలు. అదే మన భూమి సూర్యుడి చుట్టూ తిరిగేందుకు పట్టే కాలం 24 గంటలు. అంత నెమ్మదిగా కదిలేవాడు కాబట్టి శనీశ్వరుణ్ని 'మందుడు' అన్నారు మహర్షులు. నవగ్రహాల్లో ఏడోవాడైన శనీశ్వరుడు జీవరాశులను సత్యమార్గంలో నడిపించేందుకే అవతరించాడని ప్రతీతి.
జన్మవృత్తాంతం
పద్మపురాణం, స్కాందపురాణం, సూర్యపురాణం... ఇలా అనేక పురాణాల్లో శనీశ్వరుని జన్మవృత్తాంతం, ఆయన మహిమల గురించి కనిపిస్తుంది. వాటిప్రకారం త్వష్టప్రజాపతి(విశ్వకర్మ) కుమార్తె అయిన సంజ్ఞ సూర్యుని భార్య. వారికి వైవస్వతుడు (ప్రస్తుత మనువు ఈయనే), యముడు, యుమున అనే ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ, ఎంతోకాలం సూర్యుడి తేజస్సుని భరించలేకపోయిన సంజ్ఞ తన నీడకు ప్రాణం పోసి 'ఛాయ' అని పేరుపెట్టి ఆమెను తన స్థానంలో ఉంచి తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయిందట. నాటి నుంచి ఛాయాదేవి సూర్యునకు ఏమాత్రం అనుమానం కలగకుండా సంజ్ఞాదేవిలాగానే ప్రవర్తిస్తూ ఉండేదట. సూర్యుడికి ఛాయదేవి వలన సావర్ణుడు, శని, తపతి జన్మించారు. శని తన కడుపున ఉండగా ఛాయాదేవి ఈశ్వరుని గురించి తపస్సు చేసిందనీ... ఆమె కఠోరదీక్ష వల్ల కడుపులో ఉన్న శని నల్లగా అయిపోయాడనీ కానీ అదే దీక్ష వల్ల అనేక ఈశ్వర శక్తులు లభించి శనీశ్వరుడుగా పేరు పొందాడనీ ఒక కథనం.
సూర్యుడి వరం కారణంగా శని మకర, కుంభరాశులకూ నవగ్రహాలకూ అధిపతి అయ్యాడని పురాణోక్తి. శనీశ్వరుడి వాహనం కాకి. నలుపు రంగు, నల్లనువ్వులు, జిల్లేడు ఆకులను ఇష్టపడతాడనీ తైలాభిషేకప్రియుడనీ చెబుతారు. లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి(ఈమెనే దరిద్రదేవత అంటారు) శనైశ్చరుడి భార్య. అంటే శనిభగవానుడు విష్ణుమూర్తికి తోడల్లుడు అన్నమాట. శనిదూషణ సర్వదేవతలనూ తిట్టినదాంతో సమానం అని పెద్దలు చెబుతారు. ఆయనను పూజిస్తే దేవతలందరినీ పూజించినంత ఫలితం లభిస్తుందంటారు. త్రేతాయుగంలో లంకలో రావణాసురుని చెరలో ఉన్న శనైశ్చరుని ఆంజనేయుడు విడిపించాడని ఒక కథనం. అందుకే హనుమత్‌దీక్షలో ఉన్నవారినీ అలాగే మందుడికి ఇష్టమైన నల్లటి వస్త్రాలు ధరించే అయ్యప్ప దీక్షాపరులనూ ఆయన బాధించడని నమ్మిక.
న్యాయాధికారి
మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాప, పుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైశ్చరుడు నియంత్రిస్తాడంటారు. అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు. సూర్యుని కుమారులైన శని, యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించడం విశేషం. శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకలశుభాలతో పాటు ఐశ్వర్యాన్నీ ప్రసాదిస్తాడని నమ్మిక. ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ వారికి కలలో కూడా కీడు తలపెట్టకుండా సద్వర్తన కలిగినవారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెబుతారు. శనివారం-త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
courtesy : eenadu sunday
Thursday, March 4, 2010
Saturday, February 20, 2010
Thursday, February 18, 2010
మనిషి నిర్లక్ష్యమ్ చేయకూడని 10 లక్షణాలు
ఛాతీనొప్పి, కడుపునొప్పి వంటివి వచ్చినపుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి పరుగెడుతుంటాం. కానీ బరువు తగ్గటం, కొద్దిగా తినగానే కడుపు నిండటం, హఠాత్తుగా తలనొప్పి రావటం వంటి వాటిని అంతగా పట్టించుకోం. అయితే అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, అందుకు ఇతరత్రా ఆరోగ్య సమస్యలూ కారణమయ్యే అవకాశమూ ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.
1. బరువు తగ్గటం: ఎలాంటి ప్రయత్నాలు చేయకపోయినా బరువు తగ్గుతుంటే ఏదో ఒక సమస్యకు సూచన కావొచ్చని అనుమానించాలి. ఆర్నెళ్లలో 10% బరువు తగ్గితే (ఉదా: 60 కిలోలు ఉన్నవారు 6 కిలోలు) వెంటనే డాక్టర్ని సంప్రదించటం మేలు. దీనికి థైరాయిడ్, కుంగుబాటు, కాలేయవ్యాధి, క్యాన్సర్, పోషకాలను గ్రహించటంలో శరీరంలో ఇబ్బందులు ఏర్పడటం వంటివి కారణం కావొచ్చు.
2. విడవకుండా జర్వం: మన శరీరం వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో పోరాడుతున్నప్పుడు సాధారణంగా జ్వరం వస్తుంటుంది. అయితే మూడు రోజులపాటు గానీ అంతకన్నా ఎక్కువరోజులు గానీ తక్కువ స్థాయిలో (102 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువ) విడవకుండా జ్వరం ఉంటున్నా.. హఠాత్తుగా తీవ్రమైన జ్వరం (104 డిగ్రీల ఫారన్‌హీట్ కన్నా ఎక్కువ) వస్తున్నా జాగ్రత్త పడాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల వంటివి కూడా విడవకుండా జ్వరం రావటానికి కారణం కావొచ్చు. క్యాన్సర్ల వంటి జబ్బులూ ఇందుకు దోహదం చేస్తాయి.
3. శ్వాసలో ఇబ్బంది: జలుబు చేసినప్పుడో, వ్యాయామం చేస్తున్నప్పుడో శ్వాస తీసుకోవటం కష్టంగా ఉండటం సహజమే. కానీ మామూలు సమయాల్లో శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉంటే మాత్రం అనుమానించాల్సిందే. ముఖ్యంగా పడుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటే నిర్లక్ష్యం చేయరాదు. శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఏర్పడటానికి దీర్ఘకాలంగా శ్వాసకోశవ్యాధులు, బ్రాంకైటిస్, ఉబ్బసం, న్యుమోనియా, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టటం, గుండె జబ్బుల వంటివి కారణం కావొచ్చు.
4. మలవిసర్జనలో మార్పులు: రోజుకి మూడుసార్ల నుంచి వారానికి మూడుసార్లు మల విసర్జన జరుగుతుంటే సాధారణ స్థితిగానే పరిగణించొచ్చు. అందుకు విరుద్ధంగా ఏవైనా లక్షణాలు కనిపిస్తే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మలంలో రక్తం పడటం, వారానికి పైగా అతిసారం, మూడు వారాల పాటు మలబద్ధకం, నల్లగా గానీ రంగుతో కూడిన మలం, హఠాత్తుగా మల విసర్జన అవుతుండటం వంటివి గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలకు బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లు.. పేగుల్లో పూత, పెద్దపేగు క్యాన్సర్ వంటివి దోహదం చేస్తుండొచ్చు.
5. ప్రేలాపన (డెలీరియమ్): ఉన్నట్టుండి ఏదేదో మాట్లాడటం, అయోమయానికి గురికావటం వంటివి గమనిస్తే తేలికగా తీసుకోరాదు. సమయం, స్థలాలను గుర్తించటంలో తికమకపడటం, అకారణం కోపం, ఏకాగ్రత కోల్పోవటం, జ్ఞాపకశక్తి నశించటం, ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అలక్ష్యం కూడదు. ఇన్ఫెక్షన్లు, రక్తహీనత, రక్తంలో చక్కెర తగ్గటం, మానసిక సమస్యల వంటివి వీటికి దోహదం చేస్తుండొచ్చు.
6. తీవ్రమైన తలనొప్పి: తలనొప్పి సాధారణంగా వచ్చేదే అయినా హఠాత్తుగా తీవ్రంగా వస్తే మాత్రం ఇతరత్రా సమస్యలకు సూచిక కావొచ్చు. తలనొప్పితో పాటు జ్వరం, మెడ బిగుసుకుపోవటం, దద్దు, అయోమయం, మూర్ఛ వస్తుంటే వెంటనే చికిత్స ప్రారంభించాలి. 55 ఏళ్లు దాటిన తర్వాత కొందరికి కణతల్లో ధమనివాపు వల్ల కూడా కొత్తరకం తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది. మెదడులో ట్యూమర్ ఏర్పడినా తలనొప్పి రావొచ్చు.
7. హఠాత్తుగా చూపు, మాట కోల్పోవటం: ఇలాంటి లక్షణాలు పక్షవాతానికి హెచ్చరిక కావొచ్చు. శరీరంలో ఒకవైపు హఠాత్తుగా బలహీన పడటం, మొద్దుబారటం.. చూపు మసక బారటం, పూర్తిగా కోల్పోవటం.. మాట పోవటం, ఇతరుల మాటలను అర్థం చేసుకోలేకపోవటం.. మగతగా అనిపించటం, తూలి పడటం వంటివి గుర్తించినపుడు ఏమాత్రం ఆలస్యం చేయరాదు.
8. కళ్లముందు మెరుపు: హఠాత్తుగా కంటి ముందు మెరుపులాంటి కాంతి కనిపిస్తే తీవ్రమైన సమస్యకు గుర్తు కావొచ్చు. కంటి వెనక పొర నుంచి రెటీనా విడిపోయినప్పుడు ఇలా కనిపిస్తుంది. తక్షణం చికిత్స చేస్తే శాశ్వతంగా చూపు పోయే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు.
9. కొద్దిగా తిన్నా కడుపు నిండటం: ఇలాంటి లక్షణం వారం పాటు కనిపిస్తే వెంటనే డాక్టర్‌కి చూపించుకోవాలి. దీనికి వికారం, వాంతి, త్రేన్పులు, జ్వరం, బరువు తగ్గటం/పెరగటం వంటివీ తోడైతే ఇబ్బంది ముదిరినట్టే. అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ సమస్యలు ఈ లక్షణాలకు కారణం అవుతుండొచ్చు.
10. కీళ్ల వాపు, నొప్పి: కీళ్లల్లో ఇన్ఫెక్షన్ వల్ల ఇలాంటివి కనిపించొచ్చు. దీనికి గౌట్ వ్యాధి, కొన్ని రకాల కీళ్లవాపులు కూడా దోహదం చేస్తాయి.
-courtesy: eenadu sukibhava

Monday, February 15, 2010
ప్రేమ - కొన్ని డవుట్లు, నిజాలు, ఐడియాలు, ఓ పిట్టకథ
ప్రేమ గురించి మాట్లాడమంటే ప్రతి ఒక్కరు రచయితలు అవుతారు. వక్తలు అవుతారు. జీవం ఉన్న ప్రతి మనిషిలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ భావన తప్పకుండా కలుగుతుంది. ప్రేమికుల రోజు సందర్బంగా సాక్షి ఫండే ప్రత్యేక సంచిక విడుదల చేసింది. అందులో నేను రాసిన కొన్ని డవుట్లు, నిజాలు, ఐడియాలు, ఓ పిట్టకథ మీ కోసం ఈ కింది బ్లాగ్ లో పెట్టాను . చదివి నవ్వుకోండి, ఆలోచించుకోండి, ఎంజాయ్ చేయండి
http://rathalukothalu.blogspot.com/
http://rathalukothalu.blogspot.com/
Thursday, February 4, 2010
ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు!!
మహానది ఒక బిందువుగానే ప్రారంభమవుతుంది. ఒక బిందువే సమస్త విశ్వంగా విస్తరిస్తుంది. తల్లి కడుపులో బిడ్డ ఒక బిందువుగానే ఉత్పన్నమవుతుంది. మొదట వేసిన ఒక్క అడుగే వేలాది అడుగులుగా మారి గమ్యాన్ని చేరుస్తుంది. మర్రి బీజం ఆవగింజంతైనా ఉండదు. అదే మర్రి వృక్షరాజంగా విరాజిల్లుతుంది. అలాగే ఒక వ్యక్తి శక్తిగా ఎదగగలడు. మహాశక్తిగా మారగలడు. అది వెలికితీసిన దివ్యత్వమే.
ఎప్పుడూ మన కోసమైన దాన్ని మనమే భద్రపరచాలి. మనమే శుభ్రపరచాలి. దాని ఉన్నతికోసం, ఉజ్జ్వలత కోసం, ఉద్దేశ సాఫల్యతకోసం మనమే కృషిచేయాలి. ఈ ఇల్లు మనది. ఈ కుటుంబం మనది. ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, దేశం, ప్రపంచం, విశ్వం... అన్నీ మనవే. మనిషి కుదించుకుని ఉన్నప్పుడే, కుంచించుకుని ఉన్నప్పుడే 'నేను' అనే అతి చిన్న పరిధిలో ఉంటాడు. తనను తాను, తన బుద్ధిని, హృదయాన్ని విస్తరించుకుంటూ పోయే కొలదీ ఆ పరిధి చిన్నచిన్నగా, పెద్దగా, మరింత పెద్దగా, అనంతంగా విస్తరించుకుంటూ పోయి ఏకాత్మ భావనలో లయమైపోతుంది. విలీనమైపోతుంది. ముందు నేను, నాదిలోంచి విస్తరిస్తూ మనం, మనదిగా విస్తృతమై మనంలోంచి 'మనం' అనే అనేకాన్ని జయించి- నేను నా అనే సువిశాల నిజ అనంతంలోకి, ఏకత్వంలోకి లయం చేస్తూ ఆత్మభావంలో స్థిరపడిపోవాలి.
మనం మన గదిలో ఉన్నప్పుడు మన కుటుంబీకులతో 'నా గది' అంటాం. పక్కింటివాళ్లతో ఇంటిని 'మా ఇల్లు' అంటాం. వీధులకు సంబంధించి 'మా వీధి' అంటాం. అలాగే వూరు, దేశం, ప్రపంచం. సంకుచితత్వాన్ని వదలిపెడితే సర్వం 'నేనే' అనే భావనలో లీనమైపోతాం. ఈ భావం ఆత్మకే కాదు. ఆధ్యాత్మికతకే కాదు. సామాజిక జీవితానికీ వర్తిస్తుంది. ఈ ప్రపంచంలో జన్మ తీసుకున్న మనం ఈ ప్రపంచానికి, ఈ సమాజానికే చెందినవారం. ఈ ప్రపంచం కోసమే మనం జీవించాలి. దానికోసమే మరణించాలి.
మన శరీరానికి జబ్బు చేస్తే మనమే చికిత్స చేసుకుంటాం. ఎవరో చేయాలనో, చేయించాలనో సాధారణంగా ఆశించం. సమాజానికీ అంతే. అది మనది. ఏం చేసినా మనమే చేయాలి. ఈ సువిశాల విశ్వం, ఈ ప్రపంచం... ఇందులో నేనెంత! ఒక చిన్న వూరు. ఆ వూళ్లో చిన్న ఇల్లు. చిన్న కుటుంబం. అందులో నేనొకణ్ని. ఒకానొక అర్భకుణ్ని. సముద్రంలో ఒక నీటిబిందువును. భూమండలంలో ఒక మట్టి రేణువును. అణువును. కానీ, తెలుసా? ఒక అణువే ఆటంబాంబు అవుతుంది. ఒక బిందువే సింధువుగా మారుతుంది. ఒక చిన్న చిట్టెలుక... కొండను తవ్వగలదు. కాళ్లూ చేతులూ లేని చిరు చేప... సముద్రాన్ని ఈదగలదు. ఒక చిన్నారి పక్షి... ఆకాశాన్నే ఏలగలదు. మనిషి... ఆ పరాత్పరుణ్నే ఒక ఆచమనంతో ఔపోసన పట్టగలడు. ఇది ఆశ్చర్యమే. అద్భుతమే. కానీ వాస్తవం.
ఏ వ్యక్తీ 'నేనొక్కణ్ని. అర్భకుణ్ని. నేనేం 'చేయగలను?' అని భీతి చెందకూడదు. మనం శరీరానికి అర్భకులం కావచ్చు. ధనానికో, వయసుకో అర్భకులం కావచ్చు. కానీ ఆత్మవిశ్వాసానికి అర్భకులం కాదు. ఆత్మ స్త్థెర్యానికి అర్భకులం కాదు. మనిషి ఏ స్థితిలో ఉన్నా ధృతి, ధీశక్తి పోగొట్టుకొనే అవకాశం ఉంది. ఇంకా ప్రోది చేసుకునే అవకాశం ఉంది.
మనిషెప్పుడూ ఒక్కడు కాదు. ఒంటరి కాదు. ఆత్మ తోడుగా ఉంది. అనంతశక్తి తోడుగా ఉంది. ప్రాపంచికమైన తోడును పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదంటారు రామకృష్ణులు. నీకు ఎవరు; ఎందరు తోడున్నా ఎవరూ లేరనే అభిప్రాయంతోనే ఒంటరిగా నీ పనిలో నిమగ్నుడవు కమ్మంటారు. జగజ్జనని మాత్రమే తోడుగా ముందుకు సాగమంటారు. ఎంత గొప్పగా ఉంది! నిజమే. ఎవరైనా ఎందరైనా మనకు తోడుగా ఉండనీ. మంచిదే. కానీ ఎవరి సహకారమైనా మనం ఎందుకు ఆశించాలి? వాళ్ల వెన్నుదన్నుకోసం బెరుగ్గా ఎందుకు వెనక్కు వెనక్కు చూడాలి? మన శక్తిమీద, మనోస్త్థెర్యం మీద నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగటం ప్రారంభిస్తే, మనం నడిచే దారి మంచిదైతే, గమ్యం సరియైునదైతే- మన వెనక అడుగుల చప్పుడు మనకు వినబడుతుంది. మన గుండె చప్పుడులో కలిసిపోతుంది. మహాత్మాగాంధీ, మండేలా, మదర్ థెరెసా... ఒక్కరా ఇద్దరా! ప్రపంచాన్నే తమ వెంట నడిపించిన ఒంటరి పధికులు. ఆసేతు హిమాచలం ఎన్నోసార్లు పాదచారియైు పర్యటించి అంతరించిపోతున్న ఆధ్యాత్మికతను పునరుద్ధరించి, అనేక శక్తిపీఠాలను స్థాపించి, అద్వైతాన్ని మకుటాయమానంగా నిలిపిన శంకరాచార్యులు నూనూగు మీసాలైనా రాని బాల సన్యాసి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి దేశానికి స్వాతంత్య్రాన్ని సముపార్జించి పెట్టిన గాంధీజీ అర్భక అర్ధనగ్న చక్రవర్తి. డెబ్భైఏళ్లు దాటాకే ప్రభుపాద స్వామి, ఒంటరిగా కట్టుబట్టలతో అమెరికాలాంటి భౌతికవాద దేశంలో కాలుమోపి 'హరేరామ హరేకృష్ణ' ఉద్యమాన్ని వారి సొంతమే అని వారు భావించేంతలా ఉద్ధృతంచేసి, వందలాది 'ఇస్కాన్‌టెంపుల్స్' నిర్మించి, పిట్స్బర్గ్ దగ్గరలో వారి ఇష్టంతో వారే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి గోల్డెన్ పాలెస్ నిర్మింపజేసుకున్న అనితర సాధ్యుడు. ఎందరు... ఎందరు ఎందరో మహానుభావులు. ప్రయత్నమే వారి విజయ ప్రకటన. వారి సంకల్పమే వారికి తోడు. లోక కల్యాణమే వారికి సిరి, వూపిరి.
నేడు లోకంలో ఎంతో స్వార్థం, దౌష్ట్యం, అవినీతి, కష్టాలు, కన్నీళ్లు... దీన్నిలాగే వదిలేద్దామా? మనదైన ఈ లోకాన్ని ఈ సమాజాన్ని, కనీసం ఈ దేశాన్ని, కనీసం ఈ రాష్ట్రాన్ని, కనీసం... చుట్టూ ఉన్న మన పొరుగువారినైనా క్షేమంగా, సౌకర్యవంతంగా ఉండేలా మనమెందుకు ప్రయత్నించకూడదు? అందుకు ఏదో, ఏమిటో, ఎంతో అవసరం లేదు. అందుకు కావలసింది బిగించిన ఒక ఉక్కు పిడికిలి. దానికి ఆ శక్తినిచ్చే వజ్రసదృశ సంకల్పం. మనం ఒంటరివాళ్ళం కూడా కాదు. తెలీని కొత్తదారీ కాదు. మనముందు ముళ్లూ, పల్లేళ్లూ తొక్కుతూ ఎందరో ధీమంతులూ, త్యాగధనులూ నడిచి, విడిచి, వెళ్లిన అడుగు జాడలున్నాయి. వారి విజయాల జ్యోతులు మన దారి వెలుతురుకై వెలుగుతున్నాయి.
- - చక్కిలం విజయలక్ష్మి
- - courtesy : eenadu

Friday, January 29, 2010
Wednesday, January 6, 2010
'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల్ !
వివాహమే మహాభాగ్యం
జన్మతః మనిషి మూడు రుణాలతో పుడుతున్నాడన్నది ఉపనిషత్ వాక్యం. రుషుల రుణాన్ని బ్రహ్మచర్యంతో, దేవతల రుణాన్ని యజ్ఞాలతో, పితృరుణాన్ని వివాహంతో తీర్చుకోవాలని పెద్దల ఉవాచ. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవడానికి వివాహాన్ని ధార్మిక సంస్కారంగా ఆచరించే సంప్రదాయం మనది. 'పెళ్లి అనేది ఓ విచిత్ర వలయంలాంటిది. అందులో ఉన్నవారు బయటపడాలని తహతహలాడుతుంటారు. వెలుపల ఉన్నవారు లోనికి వెళ్లాలని ఉబలాటపడుతుంటారు' అని ఓ మేధావి చమత్కరించాడు కానీ, భారతీయ సంస్కృతిలో పాటించాల్సిన నాలుగు ధర్మాల్లో గృహస్థాశ్రమమూ ఒకటి. ధర్మార్థ కామమోక్షాల సాధనకోసం కలసిమెలసి ప్రస్థానిస్తామంటూ- పెళ్లినాడు చేసిన ప్రమాణాల సాక్షిగా వధూవరులు అడుగిడే పొదరిల్లు అది! 'సతుల బడయనేల, సుతుల బడయనేల, వెతలు పడగనేల వెర్రితనము...' అన్న వేమన కూడా కామి కానివాడు మోక్షగామి కాలేడు పొమ్మని తేల్చిచెప్పాడు. ఆ పురుషార్థాన్ని ప్రసాదించేది గృహస్థాశ్రమమే. సుఖదుఃఖాల్లో, కలిమిలేముల్లో సహభాగస్వాములై భార్యాభర్తలు సాగించే సంసారయాత్రకు స్నేహదీపమే దిక్సూచి కావాలి. 'మాయ, మర్మములేని నేస్తము/మగువలకు, మగవారికొక్కటె/' అంటూ 'బ్రతుకు సుకముకు రాజమార్గము'ను నిర్దేశించాడు వైతాళికుడు గురజాడ. ఆధిక్యతా భావనలను, ఆధిపత్య ధోరణులను దరికి రానీయకుండా- 'మగడు వేల్పన పాత మాటది/ ప్రాణమిత్రుడ నీకు...' అన్న గురజాడ వాక్కుకు వారసుడిగా- తన జీవన సహచరికి ఆత్మీయతాహస్తాన్ని అందిస్తూ, దాంపత్యబంధంలో స్నేహ బాంధవ్యానికి పట్టం కట్టాల్సింది పురుషుడే.
'జీవితమనే రేడియో సెట్టుకి భర్త ఏరియల్ ,్ భార్య ఎర్తు' అంటూ కవిత్వీకరించిన ఆరుద్ర- ఏకాభిప్రాయం అనే విద్యుచ్ఛక్తి లేకపోతే సెట్టు పలకడం సున్నా అన్నాడు. భార్యాభర్తల సాహచర్యం- సమశ్రుతి చేసిన ఆ పేటికలో బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా తరంగితం కావాలి. దాంపత్యమంటే- మూడు ముడులతో పెనవడిన రెండు ఆత్మలు ఒక్కటై వాగర్థాలవలె కలిసి ఉండటం! మనుగడకు మూలమంత్రమైన మమతను గుండె నిండుగా నింపుకొని జీవన మహతిపై మహత్వ స్నేహగీతాన్ని పలికించడం! అలకలు-అనునయాలు; విరసాలు-సరసాలు; ఉక్రోషాలు-ఊరడింపులు; పంతాలు-పశ్చాత్తాపాలు; కించిత్ కోపాలు-కిలకిల నవ్వులు; గిల్లికజ్జాలు- గిలిగింతలు; సాధింపులు-సర్దుబాట్లు... ఆ వీణ మెట్లపై పల్లవించే గానానికి సప్తస్వరాలై ఊపిరులూదడం! దాంపత్యమంటే- ఆలుమగలై చెట్టపట్టాలుగా తొలిసారి వేసిన ఏడు అడుగులే, సప్తాశ్వాలుగా వారి జీవనరథం మలిసంధ్యలోనూ సాగిపోవడం! ఆత్రేయ అన్నట్లు 'నేనోడి నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజు రాజీ' రానిమ్మనే ఆకాంక్షలూరే రెండు గుండెలు- కోరికలు తీరి, ఆఖరి మజిలీకి చేరుకున్నాక 'మన జీవిత పయనంలో చివరి కోర్కె ఏదనీ/ ఒకరికన్న ఒకరు ముందు కన్నుమూసి వెళ్లాలని...' నిరీక్షిస్తూ ఆర్ద్రమవుతుంటాయి. శృంగార అవసరాల్లేని వయసులోనూ పరస్పరం ప్రేమించుకునే జంటల 'చుట్టూ అల్లుకునే అనురాగమనే రాగలత శోభాయమైనది. లోకోత్తర సౌరభాలతో వెల్లివిరిసేది. పెనుగాలి వీచినా చెక్కుచెదరని ప్రదీప కళిక' అన్నది ముళ్లపూడి రమణీయ భాష్యం.
ఇతర దేశాల్లో మాదిరి కాకుండా మన సమాజంలో కుటుంబ వ్యవస్థను అవిచ్ఛిన్నంగా ఉంచుతున్నది వివాహబంధమే. స్త్రీ, పురుషుల మధ్య అనురాగబంధాన్ని దృఢతరం చేసేది వైవాహిక జీవితమేనన్నది సార్వజనీన సత్యం. మానసిక వ్యాకులతతో, నిరాశా నిస్పృహలతో కుంగిపోయే ప్రమాదం నుంచి మనుషుల్ని వివాహబంధం ఒడ్డున పడేస్తుందని, స్త్రీ-పురుషులిద్దరికీ ఇది వర్తిస్తుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఓ అధ్యయనంలో తేలింది. ఆధునిక సమాజంలో వివిధ కారణాలు, ఒత్తిళ్లు, కౌటుంబిక సంబంధాల్లో వస్తున్న మార్పులు వంటివాటివల్ల వివాహబంధాలు తెగిపోవడం, భార్యాభర్తలు విడిపోవడం పరిపాటయిన రోజులివి. కాలానుగుణంగా విలువలూ మారుతుండటంతో- వివాహ వ్యవస్థ మీద నమ్మకం లేనివారినీ తప్పు పట్టలేం. అయితే, మనుషులకు మనశ్శాంతి చేకూర్చేది వివాహబంధమేనని తేలడం- అనాదిగా వస్తున్న ఆ వ్యవస్థ ఔన్నత్యానికి పట్టం కట్టేదే. పెళ్లితో ఎక్కువగా మేలు పొందేది మహిళలు మాత్రమేనని ఇంతకుముందరి అధ్యయనాలు పేర్కొనగా- స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ఇరువురికీ వివాహబంధం మానసిక స్వాస్థ్యం చేకూరుస్తుందని తాజాగా వెల్లడయింది. విడాకులు, లేదా జీవిత భాగస్వామి కనుమూయడం వంటి కారణాల వల్ల ఆ బంధం తెగిపోతే, మహిళలకన్నా పురుషులే మానసికంగా ఎక్కువ కుంగిపోతారని చెబుతున్న పరిశోధకులు- పెళ్ళితో నిమిత్తం లేకుండా సహజీవనం చేస్తున్నవారికన్నా, వివాహబంధంతో ఒక్కటైనవారే ఎక్కువ సంతోషంగా ఉన్నారంటున్నారు. అంతమాత్రాన- 'మనువేలనయ్యా, మనసు నీదైయుండ' అంటూ పరస్పర నమ్మకంతో, అన్యోన్యంగా జీవనయాత్ర సాగిస్తున్న వారిది భార్యాభర్తల సంబంధం కాకుండా పోదు. ఆనందమయంగా ఉంటుందనుకుంటే, స్త్రీ, పురుషులు వివాహబంధంతో ఒక్కటై బతుకుబాటలో పయనించడంలోను ఇబ్బంది ఉండదు. ఏ తీరులో ఉన్నా అది దాంపత్యమే. తాంబూలంలా రాగరంజితమైనదే. మహాకథకులు మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లు- తాంబూలమైనా, దాంపత్యమైనా ఆద్యంతం రసవంతమే!
-eenadu editorial

Sunday, January 3, 2010
అనుకోకుండా ఓ ఆలోచన.. ఆదాయం తెచ్చింది !
సలవులొచ్చినా, తీరిక దొరికినా సినిమా ఒక్కటే వినోదం కాదు. కుదిరితే నాలుగు మాటలు. కుప్ప పోసుకోవాలనుకుంటే బోలెడన్ని అనుభూతులు. కాసింత విజ్ఞానం. కావాల్సినంత సంతోషం. క్షణం తీరిక దొరకని ఆధునిక జీవితాలకు ఇవే ముఖ్యం అనుకున్న ప్రియాంక... 'ఈవెనింగ్అవర్ డాట్‌కామ్' లైబ్రరీ... మినీ థియేటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇది పదిమందికీ ఆనందం పంచే వేదిక. ఆమెకు ఉపాధి మార్గం.
ఎం.ఎస్. చదివి
ప్రియాంకకు అసలు ఈ ఆలోచన అనుకోకుండా వచ్చింది. ఎం.ఎస్. చదివిన ఆమె అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసింది. వివాహరీత్యా హైదరాబాద్‌కి వచ్చేసిన ఆమె ఇక్కడే స్థిరపడాలనుకుంది. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే ఆదాయం సంపాదించాలనుకుంది. అప్పుడు కలిగిన ఆలోచనే ఈవెనింగ్ అవర్. అది ప్రియాంకకు బాగా నచ్చింది. కానీ ఇంట్లో వారు వద్దన్నారు. 'అంత చదువుకున్నావు... ఏదయినా వ్యాపారం చేయొచ్చుగా' అని సూచించారు. ప్రియాంక వారిని ఒప్పించింది. దీనివల్ల పదిమందికి విజ్ఞానం, వినోదం. ఇంటిపట్టున ఉన్నా నాకు ఆదాయ మార్గం అంటూ వివరించింది. పుస్తకాల సేకరణ, ఆన్లైన్లో వాటిని ఎంచుకునే ఏర్పాటు, ధరల నిర్ణయం వంటి వాటికి ఆర్నెల్ల సమయం పట్టింది. ఇంట్లో మినీ థియేటర్ ఏర్పాటుకైతే బాగా కష్టపడాల్సి వచ్చింది. ఖర్చూ భారమైంది. ఎలాగైతేనేం, నాలుగు నెలల క్రితం లైబ్రరీ... థియేటర్... రెండూ అందుబాటులోకి వచ్చాయి.
ఆరువేల పుస్తకాలు...
పుస్తక ప్రియులు ఈవెనింగ్ అవర్ డాట్‌కామ్‌లోకి ప్రవేశిస్తే అందుబాటులోని పుస్తకాల జాబితా ఎదురొస్తుంది. నెలకి వంద రూపాయల రుసుముతో ఎవరైనా వారానికి రెండు పుస్తకాలు తీసుకోవచ్చు. తెలుగు, ఆంగ్లంలోని పేరెన్నికగన్న పుస్తకాలను హాయిగా చదువుకోవచ్చు. 'కొందరికి పుస్తకాలంటే ప్రాణం. మరికొందరికి అప్పుడప్పుడూ చదివే అలవాటు. అందుకే బేసిక్, స్టార్టర్, ఎవిడ్ రీడర్ అంటూ మూడు ప్యాకేజీల్లో పుస్తకాలిచ్చే ఏర్పాటు చేశా. పాఠకులు కోరుకుంటే ఇంటివద్ద పుస్తకాలందించే సదుపాయమూ ఉంది' అని తెలిపారు ప్రియాంక.
థియేటర్ అంతా కుటుంబమే..
గ్రంథాలయం ఏర్పాటులో ప్రియాంక వ్యక్తిగత ఆనందమూ ఇమిడి ఉంది. పుస్తక పఠనంపై అమితాసక్తి కలిగిన ఆమె పుస్తకాలను చదివి, వాటి మీద సమీక్షలను సైట్లో ఉంచుతారు. అవి పుస్తకాల ఎంపికలో పాఠకులకు దిక్సూచిలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం నవలలు, కథలు, జీవిత చరిత్రలు, సైన్స్ ఫిక్షన్... అన్నీ కలిపి నాలుగు వేల పైచిలుకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పాఠకులు కోరితే మరో రెండు వేల పుస్తకాలు తెప్పించే ఏర్పాట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవడమే కాదు. హాయిగా గ్రంథాలయంలో కూర్చుని కమ్మని కాఫీ తాగుతూ... స్నాక్స్ తీసుకుంటూ చదువుకొనే వీలు కూడా ఉంది. ఇదంతా ఒకెత్తు కాగా... ఏడెనిమిది మంది కుటుంబ సభ్యులు ఇంటి వాతావరణంలో... నవ్వుతూ తుళ్లుతూ... మినీ థియేటర్లో సినిమా చూసే వీలు కల్పించడం మరో ప్రత్యేకత. ఒక కుటుంబం, కోరుకున్న సినిమా చూసేందుకు వెచ్చించాల్సిన మొత్తం కేవలం మూడొందలు. అయితే ఈ మొత్తం చెల్లించి కొత్త సినిమాలు చూడాలని ఆశపడితే కుదరదు. మార్కెట్లోకి వచ్చేసిన డీవీడీలకే పరిమితం.
సభ్యులు మూడొందలు...
ఆలోచన వినూత్నంగా ఉంటే ఆదరణ సులువే. ప్రియాంక విషయంలో అదే నిజమైంది. లైబ్రరీ, థియేటర్ ఆరంభించిన నాలుగు నెలలకే మూడొందల మంది వినియోగదారులు సభ్యులయ్యారు. ఆనోటా ఈనోటా ఈ వినూత్న ఉపాధికి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఎంతో తపనపడి ఆరంభించిన ఆమె నేడు ఆదాయం పొందుతున్నారు. ఆనందంగా ఉన్నారు.
courtesy - eenadu

Friday, January 1, 2010
హే జెంటిల్మెన్.. లిజన్ టు మీ.. !

aadadi gurthinchani magavaaadi antharanggaani.. soooTiga, chakkaga, simple gaa.. saaahityam vaadakunda, vaaduka baashalo raajireddy garu... MADHUPAM (o magavaadi feelings) name tho pustakam vesaru.
daanini chadivi feel ayyi raasina riview idi.
books available at visaalandra book house or 99482 99593
Subscribe to:
Posts (Atom)